ఈ నెల 08న జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ డిసిసి అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి
9వ్యూస్, మహబూబాబాద్ జిల్లా, జులై 06: నేడు మహబూబాబాద్ మండలం పర్వతగిరి సొమ్ల తండా జరిగే పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనకు ఈ నెల 08న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రిలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి లతో జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను,హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ డిసిసి అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి.
అనంతరం మహబూబాబాద్ శాసనసభ్యులు డా మురళీ నాయక్ నివాసం నందు మహబూబాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలోనీ ఉన్న అన్ని వార్డు ముఖ్య నాయకులతో సమావేశంలో పాల్గొని ఈ నెల 08న జరగబోయే బహిరంగ సభ విజయవంతం చేయలని ఎమ్మెల్యే డా మురళీ నాయక్ పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు అలర్ట్ గా ఉండండి, మానుకోట నియోజకవర్గంలో 90 శాతానికి పైగా కౌన్సిలర్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందే విధంగా సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే డా.మురళి నాయక్ పిలుపునిచ్చారు.
ఈ సభను విజయవంతం చేయాలని రాబోయే స్థానిక సంస్థలలో ప్రతి అన్ని వార్డు లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయలన్నారు.
ఈ సభకు అధిక జన సమీకరణ చేయాలని జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు.
సొమ్ల తండాలో జరిగే సభను విజయవంతం చేయండి.ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు