ఘనంగా లక్ష నాగవల్లి దళార్చన

ఘనంగా లక్ష నాగవల్లి దళార్చన


9veiws, సూర్యాపేట జిల్లా కల్చరల్ ఇంచార్జి ,మే21: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి పంచాహ్నిక ఉత్సవములలో బాగంగా 4 వ రోజు బుధవారం వేద పండితులు ధరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా లక్ష నాగవల్లి దళార్చన(తమలపాకులతో )నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి  తెల్లవారుజామునే ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.స్వామి వారికి 11 పర్యాయాలు వేద పండితులు సామూహిక శ్రీరామ సహస్ర నామాలు పటిస్తూ లక్ష తమలపాకులతో స్వామికి పూజలు నిర్వహించారు.హనుమ జయంతి వేడుకల సందర్భంగా ధరూరి శ్రీనాథచార్యుల ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఐదు రోజులపాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకలలో బాగంగా గురువారం 5 వ రోజు హనుమ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి భానుపురి హనుమాన్ చాలీసా భక్త బృందం, హనుమత్ దీక్ష భక్త బృందం, హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం చే 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన,స్వామికి  ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుననీ తెలిపారు.  తదుపరి ఆరగింపు, మంగళా శాసనం, తీర్థప్రసాద వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వాహణాధికారి ఎం.పీ లక్ష్మణరావు, దరూరీ శ్రీధరాచార్యులు, ధరూరి పవన్ కుమార చార్యులు దరూరి కార్తీకా చార్యులు, ధరూరి సంతోష్ కుమార్ ఆచార్యులు,మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, పబ్బా ప్రకాష్, పబ్బా రామమూర్తి, పురం నాగరాజు, దేవేంద్ర చారి, తొనుకునూరి వెంకటేశ్వర్లు, గజ్జి కృష్ణయ్య, గుండా గోపికృష్ణ, నోముల శ్రీనివాస్, శ్రీరంగం రాము,కొత్త రజిని,  పబ్బా ప్రమీల,నోముల విమల, కక్కిరేణి పద్మ, పబ్బా జయప్రద,పోతుగంటి సునీత,పబ్బా సంధ్య, తెడ్ల పల్లవి, బచ్చు నీరజ పురుషోత్తం  తదితరులు పాల్గొన్నారు.







Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.