కామ్రేడ్ జలగం జనార్ధన్ (జున్ను) స్ఫూర్తితో ప్రజా పోరాటాలను చేస్తాo
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
9veiws, సూర్యాపేట టౌన్ ,జిల్లా బ్యూరో ఇంచార్జి, మే21: కామ్రేడ్ జలగం జనార్ధన్ (జున్ను) సార్ నాలుగవ వర్ధంతి సందర్భంగా ఖమ్మం రోడ్డు చంద్ర పుల్లారెడ్డి నగర్ లో తన విగ్రహాన్ని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆవిష్కరించారు .అనంతరం సంస్మరణ సభలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ జున్ను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విప్లవ స్ఫూర్తి కి నిలువెత్తు నిదర్శనమని అన్నారు ఆయన ఆలోచనలు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళుతూ ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు ఈ జిల్లాలో సిపిఐ ఎంఎల్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చేస్తుందని అన్నారు దేశంలో మోడీ ఫాసిస్ట్ విధానాలతో ప్రశ్నించే ప్రతి ఒక్కరిని చిత్రహింసలకు గురి చేస్తూ ఎన్కౌంటర్లు చేస్తూ రాజ్య హింసను కొనసాగిస్తున్నారు ఆ క్రమంలోనే మావోయిస్టులను, వారితోపాటు అమాయక గిరిజనులను పిట్టల్లాగా కాల్చి చంపుతున్నారని అన్నారు శాంతి చర్చలు చేద్దామని మేధావులు అన్ని రాజకీయ వర్గాలు ముందుకు వచ్చిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన ఆటవిక న్యాయాన్ని కొనసాగిస్తుంది ఆ క్రమంలోని ఈరోజు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావుతోపాటు 27 మంది నక్సల్స్ పేరుతో దారుణంగా కాల్చంపారు మా పార్టీ తరపున ఎన్కౌంటర్ను ఖండిస్తూ వారికి విప్లవ జేజేలు తెలియజేస్తున్నామని అన్నారు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్లు ఆపి చర్చ జరపాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కామ్రేడ్ జున్ను నేటి తరానికి ఒక మార్గదర్శిని ఆయన పోరాటాలు పేద ప్రజల కోసం తను చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు శత్రువులు పోలీసులు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించిన భయపడకుండా తన ఆఖరి శ్వాస వరకు పేద ప్రజల పక్షాన పోరాడిన విప్లవ దీశాలని అన్నారు ఈ జిల్లాలో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజల కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మోసలైన్ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోకినపల్లి వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగన్న,, గొడ్డలి నరసన్న, వాసా పల్లయ్య, పిఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి సూరం రేణుక, ఉపాధ్యక్షురాలు సంతోషి జిల్లా నాయకులు ఐతరాజు పద్మ పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్ ,ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, వీరబాబు కట్టా రమేష్ గొడ్డలి లింగన్న తదితరులు పాల్గొన్నారు.