కలెక్టర్‌ ఆధ్వర్యంలో అనాథ వధువుకు వివాహం

 కలెక్టర్‌ ఆధ్వర్యంలో అనాథ వధువుకు వివాహం


9veiws,పెద్దపల్లి జిల్లా,మే21: అనాథ వధువు వివాహానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అన్ని తానే అయ్యారు.సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో తలపెట్టిన మానస- రాజేష్ ల కళ్యాణ మహోత్సవం బుధవారం బుధవారం ఉదయం 11.5 గంటలకు వైభవోపేతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తబిత బాలల సంరక్షణ సంస్థ పుత్రికను వివాహం చేసుకున్న వరుడు రాజేష్‌తో పాటు అతడి తల్లిదండ్రులు రేణుక, యాకయ్యను అభింనందించారు.ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, డీసీపీ కరుణాకర్, అదనపు కలెక్టర్ డీ వేణు, జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరుల కోసం జిల్లాలోని ఉద్యోగుల నుంచి సేకరించిన రూ.61వేల 800 చెక్కును కలెక్టర్ అందించారు.





Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.