దాతలకు పురస్కారాల ప్రధానం
9veiws, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఇంచార్జి,మే21: భువనగిరి యాదాద్రి జిల్లా, పాటిమట్ల గ్రామంలో మాతృదేవోభవ పితృదేవో భవ సంస్థ వ్యవస్థాపకులు కురుమేటి నవీన్ ఆధ్వర్యంలో 6వ. వార్షికోత్సవం సందర్భంగా రక్త దాతల పురస్కారాన్ని దైద. కిరణ్ కుమార్ అవిరేండ్ల. సందీప్ కుమార్దైద. సాయినాథ్ ఉబ్బపల్లి రాజేష్ గాంధీనగర్ కు చెందిన యువత కు సి.బి.ఐ మాజీ డైరెక్టర్. జేడీ లక్ష్మీనారాయణ జనయేత్రీ ఫౌండేషన్ చైర్మన్, డాక్టర్.మునిర్ అహ్మద్ షరీఫ్ చేతులు మీదుగా రక్తదానం చేయడం, రక్తదానం చేపించడం స్వచ్ఛంద సేవకు గుర్తించి 2025 రక్తదాత పురస్కారాన్ని మెమెంటో శాలువా తో సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. యువత ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని రక్త కొరత లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. పురస్కారం ఇచ్చిన కురుమేటి నవీన్ కి ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో భువనగిరి యాదాద్రి జిల్లా. రెడ్ క్రాస్ చైర్మన్. నరసింహారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక యువజన సంఘం ఆల్ ఇండియా అధ్యక్షులు. కప్పల రవికుమార్ గౌడ్. నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లా ల ఉమ్మడి రక్తదాతలో యువత పాల్గొన్నారు.