ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
41 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఏడవ తరగతి పూర్వ విద్యార్థులు
నాటి గురువులను సన్మానించి ఆనందంగా గడిపిన స్నేహితులు
9views, సూర్యాపేట జిల్లా బ్యూరో ఇంచార్జి, మే21: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఇస్తాలాపురం గ్రామ మండల ప్రాథమిక పాఠశాలకు చెందిన 1983 - 84 సంవత్సరం ఏడవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సుమారు 41 సంవత్సరాల తర్వాత కలుసుకున్న ఆనాటి విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ నాటి జ్ఞాపకాలు పంచుకొని ఆనందంగా గడిపారు. నాడు తమకు విద్యాబుద్ధులు చెప్పి ఉన్నత మార్గంలో పయనించేలా కృషి చేసిన నాటి ఉపాధ్యాయులను పూలమాలలు శాలువాలు మేమోంటోలతో సత్కరించారు. అనంతరం ఒక్కొక్కరుగా తమ జీవన స్థితిగతులను స్నేహితులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాటి గురువులు రామనాథం, అప్పారావు, నారాయణ, బాబురావు, పుల్లయ్య, పూర్వ విద్యార్థులు గండమల్ల శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, తూడి శంకర్ రావు, నీలమ్మ, కిషోర్, తావూర్య, నిర్మల, మానుపురి శ్రీనివాస్, ఇరుగు బాబు, కంచర్ల వెంకట్ రెడ్డి, మన్సూర్ అలీ, రావుల శ్రీను, వెంకన్న, వనమ్మ, కళావతి, శ్యామల, వసంత, లలిత తది తరులు పాల్గొన్నారు.