విద్యార్థులకు ప్రేరణ కలిగించాలి
9వ్యూస్, సూర్యాపేట టౌన్, జులై10: లక్ష మంది విద్యార్థులకు ప్రేరణ కలిగించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కృషి చేస్తుందని,
అందులోభాగంగా సూర్యాపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా
పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో యువ వికాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట అధ్యక్షులు మిర్యాల సుధాకర్ తెలిపారు.
గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిటీ టాలెంట్ స్కూల్లో విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్ధి దశ నుండే క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.
డిస్టిక్ గ్లోబల్ మెంబర్షిప్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని
అందులో భాగంగా కరోనా సమయంలో కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ప్రజల కొరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులు పూర్ణ శశికాంత్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో
ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ఒక క్రమ శిక్షణ,పట్టుదల తో పాటు ఏకాగ్రత ఉన్నప్పుడే ఒక లక్ష్యాన్ని చేరుకోగలమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ కొండ పల్లి లక్ష్మారెడ్డి, లయన్స్ క్లబ్ కార్యదర్శి గుండా లక్ష్మయ్య కోశాధికారి పాశం అనంతరావు,
ప్రోగ్రాం కోఆర్డినేటర్ వాంకు డోతు వెంకన్న పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్ రెడ్డి ప్రిన్సిపాల్ మురళీధర్ తో పాటు సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.