గణపతి దీక్ష తేదీల కరపత్రం ఆవిష్కరణ
9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా కాజీపేట: జులై 12: గత 25 సంవత్సరాల నుండి
స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రం గణపతి మాలలు వేసుకుంటున్నారు.
ఈ క్రమంలో 108 రోజులు 41 రోజులు 21 రోజులు 16 రోజులు 11 రోజులు దీక్షలు తీసుకుంటున్నారు
పురాణాల్లో చెప్పినటువంటి విషయం పార్వతి దేవి కూడా ఈ యొక్క గణపతి దీక్షను తీసుకున్నది అని చెప్తుంది
అలాంటి ఈ గణపతి దీక్షను ఈ దేవాలయంలో తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ దేవాలయం నుండి ప్రారంభం అయినది
మరియు ఇప్పటివరకు నిర్విరామంగా వేలాదిమంది భక్తులచే గణపతి దీక్షను తీసుకోవడం జరుగుతుంది.
ఈ సంవత్సరం గడప దీక్ష తేదీలు ప్రకటించడం జరిగింది. 41 రోజుల మండల దీక్ష జూలై 26వ తేదీ ప్రారంభం 21 రోజులు
అర్ధమండల దీక్ష ఆగస్టు 16వ తేదీ ప్రారంభం16 రోజుల షోడశదీక్ష ఆగస్టు 21వ తేదీ ప్రారంభం 11 రోజులు ఏకాదశ దీక్ష ఆగస్టు 26వ తేదీ ప్రారంభం
మాల విసర్జన దీక్షా విరమణ సెప్టెంబర్ 6 తేదీన నిర్వహిస్తారని గణపతి సేవా సమితి సభ్యులు నేడు ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర శర్మ దేవాలయ వైదిక కార్యక్రమా నిర్వాహకులు..
అయినవోలు రాధాకృష్ణశర్మ దేవాలయ పరిపాలన విభాగం అయినవోలు సాయి కృష్ణ శర్మ మరియు గురు స్వామి లక్క రవి మదన్మోహన్ అర్చకులు శివ ఏది రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి...
పలువురు భక్తులు పాల్గొని ఆవిష్కరణ చేశారు భక్తులు ఎవరైనా దీక్ష తీసుకోవాలి అనుకున్న వారు పూర్తి వివరాలకు 9347080055 నాకు సంప్రదించగలరు.