స్థానిక సంస్థల సన్నాహక సమావేశం
9views,ఐనవోలుమండలం,జులై10:మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం
ఐనవోలు మండలంలోని రాంనగర్,నందనం గ్రామాలలో కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐనవోలు మండల ఇంచార్జ్ గుజ్జ గోపాల్ రావు మండల కన్వినర్ తంపుల మోహన్ విచ్చేశారు.
ఈ సందర్భంగా గుజ్జ గోపాలరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు పథకాలు అని చెప్పి ప్రజలను ఇబ్బందులకు చేసిందని,
గ్రామాలలో అభివృద్ధి కుంటు పడిందని త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో గ్రామ పార్టీ ఇంచార్జిలు వేణు,రాకేష్,జయశంకర్,జగపతి,రఘువంశీ,క్రాంతి,గ్రామ పార్టీ అధ్యక్షులు,
సుదర్శన్, దేవదాస్, అశోక్, రాజేంద్రప్రసాద్, sk.జిందా,శ్రీను తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.