జంపాల ప్రత్యేక పూజలు

గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో జంపాల ప్రత్యేక పూజలు


9veiws digital news ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 10,(9వ్యూస్) :గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని


 ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో బీ కాలనీలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో


 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వవహక కార్యదర్శి జంపాల సీతారామయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఆయన శ్రీ సాయిబాబాను దర్శించుకొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.


ఈ సందర్భంగా జంపాల సీతారామయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.


గురువు ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞానం శాంతి సౌభాగ్యాలను తెచ్చిపెడతాయని 


ఈ పవిత్రమైన రోజున సాయిబాబా ఆశీర్వాదంతో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


గురు పౌర్ణమి సందర్భంగా మందిరంలో జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించాయి.


జంపాల సీతారామయ్య మాట్లాడుతూ గురు పౌర్ణమి అనేది ఆధ్యాత్మిక జీవనంలో గురువు పాత్రన స్మరించుకొనే పవిత్రమైన సందర్భం.


శ్రీ షిర్డీ సాయిబాబా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సమృద్ధిగా శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.


ఈ కార్యక్రమం స్థానిక భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.