ఇందిరా మహిళా శక్తి సంబరాలు
9వ్యూస్ డిజిటల్ న్యూస్, నేరేడుచర్ల, జులై 09: నేరేడుచర్ల మండలం పెంచికలదిన్నె గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న
నేరేడుచర్ల ఏపిఎం నాగేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వడ్డీ లేని రుణాలు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత పౌల్ట్రీ మదర్ యూనిట్స్ మినీ గోదాములు యూనిఫామ్స్ తయారీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు..
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ పంపులు ఆర్టీసీ బస్సుల పెట్టుబడి సమకూర్పు ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు
ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రమాద బీమా రుణబీమా వడ్డీ లేని రుణాలు డిజిటల్ లావాదేవీలు సిఆర్పి వ్యూహం ద్వారా ఎస్ హెచ్ జి వివో మరియు ఎమ్మెస్ లకు శిక్షణసంఘాల బలోపేతం మోడల్ మండలాల తయారీ సీఎం టిసిల ఏర్పాటు...
రివాల్వింగ్ మరియు సిఐఎఫ్ విడుదల వివో ఓబి సభ్యులకు శిక్షణ కొత్త సంఘాల ఏర్పాటు కిశోర బాలిక దివ్యాంగుల వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ యొక్క కార్యక్రమాలు గ్రామ గ్రామాన నిర్వహించి సభ్యులకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వివోఏలు సంఘాల లీడర్లు సభ్యులు పాల్గొన్నారు.