నిరుపేదలకు బాసటగా సిఎం రిలీఫ్ ఫండ్

 నిరుపేదలకు బాసటగా సిఎం రిలీఫ్ ఫండ్

 

9వ్యూస్ డిజిటల్ న్యూస్, హుజూర్ నగర్, జులై09: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందని ఉత్తమ్ సార్ సోషల్ మీడియా సోల్జర్, 14వ వార్డు ఇందిరమ్మ కమిటీ నెంబర్ దగ్గుపాటి కవిత బాబురావు అన్నారు.



ఈ రోజు తిలక్ నగర్ 14 వార్డ్ కు చెందిన జడ భవాని భర్త సుదీర్ తన కూతురు విషిత కు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం గత 6నెలలు క్రితం దరఖాస్తు చేసుకోగా,ఈ రోజు దానికి సంబంధించిన 40,000 రూపాయల చెక్ ను లబ్ధిదారులకు పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదల కొరకు వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి చికిత్స కోసం,


 అతి తక్కువ సమయం లో అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు సద్వినియోగం చేసుకోవాలనీ, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు త్వరిత గతిన విడుదలవుతున్నాయని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా ఆపద వచ్చినప్పుడు 5 లక్షల పరిమితి ఉండగా...కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిందనీ, 


ఆరోగ్య శ్రీ కార్డు బి. పి.ఎల్ కుటుంబాలతోపాటు రేషన్ కార్డు లేనివారు కూడా ఈ పథకానికి అర్హులుగా ఉంటారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య విషయం లో ప్రత్యేక దృష్టి పెట్టింది అని ఆయన అన్నారు.



ఈ కార్యక్రమంలో... కాంగ్రెస్ పార్టీ నాయకులు కోల్లపూడి దయాకర్ CPI నాయకులు సోమగానికి కృష్ణ CPI దేశ దేశ బోయిన ఎంకన్న తిలక్ నగర్ మాలలు మామిడి ఇమ్మానుయేల్ కోల్లపూడి కళ్యాణ్ అలవాల ఉపేందర్ మామిడి బెంజిమెన్ హరీష్ మహిళలు మంగతాయి కరుణమ్మ పద్మ మరియమ్మ మమత కాంతమ్మ బాయ్అమ్మ అభిరంజమ్మ సరోజన మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.