ఇందిరా మహిళా శక్తి సంబరాలు
9వ్యూస్ డిజిటల్ న్యూస్, నేరేడుచర్ల ,జూలై 09: నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో చిల్లేపల్లి గ్రామ సంఘం లో సహాయక సంఘాల గురించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వడ్డీ లేని రుణాలు రెండు విడతలుగా రావడం జరిగింది.
అలాగే మూడవ విడత కూడా విడుదల అయినవని తెలియజేశారు సంఘాలలో చేరిన సభ్యురాళ్లకు ప్రమాద భీమా రుణ భీమా వర్తిస్తుందని అన్నారు.
ఈ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత పౌల్ట్రీ మదర్ యూనిట్స్ మినీ గోదాములు యూనిఫార్మ్స్ తయారీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ పంపులు మరియు నూతన సంఘాల ఏర్పాటులో భాగంగా కిశోర బాలిక దివ్యాంగులు వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రతి మహిళ సంఘ సభ్యురాలుగా ఉండాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిసి సైదులు పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరరావు గ్రామ వివో ఏలు నాగలక్ష్మి జ్యోతి మరియు గ్రామ సంఘం అధ్యక్షురాలు సంఘాల లీడర్లు సభ్యులు పాల్గొన్నారు.