ధర్మం కోసం అమరవీరుల త్యాగాల చరిత్ర మొహరం పండుగ
_మొహరం సందర్భంగా కొండపల్లి పీర్ల పంజా వద్ద ప్రార్థనలు చేసిన జంపాల సీతారామయ్యా
ఎన్టీఆర్ జిల్లా,ఇబ్రహీంపట్నం, జూలై 5, (9వ్యూస్):ధర్మం కోసం మానవ హక్కుల సంరక్షణ కోసం మహ్మద్ ప్రవక్త మానవులు ఇతర అమరవీరుల త్యాగాల చరిత్ర మొహరం పండుగని మొహరం పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో సంతాపంతో నిర్వహించుకుంటారని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య మొహరం పండుగ సందర్భంగా శుక్రవారం నాడు సాయంత్రం కొండపల్లిలోని హజరత్ జల్ జలాలే సాహెబ్ పీర్ల పంజను సందర్శించారు.
ఈ సందర్భంగా పంజా కమిటీ సభ్యులు జంపాలని ఇస్లాం సంప్రదాయం ప్రకారం సన్మానించారు.ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు జంపాల సీతారామయ్య.