విశ్వశాంతి పాఠశాలలో గోరింటాకు సంబరాలు

విశ్వశాంతి పాఠశాలలో గోరింటాకు సంబరాలు    


9వ్యూస్ ,కోరుట్ల ,జులై 05:జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో ఆషాడ మాసంలో భాగమైన "గోరింటాకు సంబరాలు" అంబరాన్ని అంటాయి. విద్యార్థినులందరూ గోరింటాకు పెట్టుకుని ఎంతోఆనందోత్సహాలతో కేరింతలు కొట్టారు. పాఠశాల కరస్పాండెంట్ బ్రహ్మన్న  శంకర్ శర్మ మాట్లాడుతూ గోరింటాకు యొక్క విశిష్టత మరియు గోరింట పూచింది కొమ్మ లేకుండా..



 ఇలా పాడుకుంటూ అందంగా మురిసిపోతారని మహిళలు ఆషాడ మాసంలో.. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా.. ఆషాడంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంటారని,మన వాతావరణం ప్రకారం ఆషాడంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది.


 అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. కావున అందరూ గోరింటాకు పెట్టుకోవడం వలన సూక్ష్మ క్రిముల నివారణలో భాగమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.