తెలుగు దేశం పార్టీ ధ్యేయం సామాజిక న్యాయం
తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధ్యక్షుల ప్రకటన
ఎన్టీఆర్ జిల్లా,విజయవాడ, జూలై 5, (9వ్యూస్) : తెలుగు దేశం పార్టీ సామాజిక న్యాయం అమలు చేయటంలో ఎప్పుడు ముందు వుంటుంది.తెలుగు దేశం పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగానే తిరువూరు నగరంలో 20 వార్డుల్లో మూడు మండలాల్లో 55 గ్రామాల్లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎన్నుకోవటం జరిగిందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నియోజకవర్గ అబ్జర్వర్ సుఖవాసి శ్రీనివాసరావు సంస్థాగత ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు గన్నే ప్రసాద్ (అన్న) లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశం లో తిరువూరు పట్టణ తిరువూరు రూరల్ మండలం గంపలగూడెం మండలం విసన్నపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్న వారి పేర్లు ప్రకటించారు.
తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మల్లెల శ్రీనివాసరావు తిరువూరు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా దుబ్బాక వెంకటేశ్వర్లు గంపలగూడెం మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిగా మానికొండ రామకృష్ణ ( ఎం.ఆర్.కె) విసన్నపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రాయల సుబ్బారావు లను ఎన్నుకొన్నట్లు తెలియజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాదాపు గత రెండు నెలలుగా తిరువూరు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ అబ్జర్వర్ సుఖవాసి శ్రీనివాసరావు నాయకత్వంలో
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో 96 గ్రామాల్లో గ్రామ కమిటీల కోసం సమావేశాలు నిర్వహించటం జరిగిందన్నారు.
పోటీ వున్న చోట మెజార్టీ అభిప్రాయం ప్రకారం పోటీలేని చోట ఏకగ్రీవంగా పట్టణ, మండల గ్రామ కమిటీలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోవటం జరిగిందని తెలిపారు.కొత్తగా ఎన్నికైన మండలాధ్యక్షులు పార్టీని బలోపేతం చేయటంతో కృషి చేయాలని ఆక్షాంకిస్తూ అందరికీ అభినందనలు తెలిపారు.
గన్నె ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని అనుసరించి టిడిపి సంస్థాగత ఎన్నిక ప్రక్రియ జరిగిందన్నారు.రాబోయే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించే విధంగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థాగత ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు నవనీతం సాంబశివరావు సంస్థాగత ఎన్నికల పరిశీలకులు రామినేని రాజశేఖర్ ఎస్.ఎమ్.ఫైజాన్ వల్లూరి మధుసూధనరావు ఏచూరి రాము పాల్గొన్నారు.