భద్రకాళి అమ్మవారి ఊరేగింపులో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
9వ్యూస్ డిజిటల్ న్యూస్, హనుమకొండ, జూలై 08 :హనుమకొండలోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , ఆయన సతీమణి శ్రీమతి నాయిని నీలిమ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఎమ్మెల్యే దంపతులు అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందారు.
తర్వాత ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని KUDA ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తో కలిసి పనులు పరిశీలించారు. మాడ వీధులు, ఆలయ పరిసర అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.
ఆషాఢ శుద్ధ పూర్ణిమ సందర్భంగా శాకంబరీ ఉత్సవాల్లో చివరి రోజు అయిన శాఖంభరీ అలంకరణకు కూరగాయలతో వరంగల్ మరియు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు సాదర స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శేషు భారతి,ప్రధాన అర్చకులు శేషు తదితరులు పాల్గొన్నారు.