గిరిజన కోచింగ్ సెంటర్ వేరే చోట మార్చి, ఎస్టీ హాస్టల్ పునః ప్రారంభించాలి
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయినికి మెమోరాండం అందజేసిన విద్యార్థి సంఘాలు
9వ్యూస్ డిజిటల్ న్యూస్ , హన్మకొండ, జూలై 08: బాలసముద్రంలో ఉన్న గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన కోచింగ్ సెంటర్ వేరే చోట మార్చి, బాలసముద్రంలోని ఎస్టీ బాలుర హాస్టల్ పునః ప్రారంభించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకి మెమోరాండం అందజేసినట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని ఎస్టీ హాస్టల్ లేకపోవడంతో గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని,
గిరిజన కోచింగ్ సెంటర్ వేరే చోట మార్చాలని, స్టేషన్ ఘనపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి గెజిటెడ్ హెచ్ఎం డిప్యూటేషన్ కోచింగ్ సెంటర్లో పని చేస్తున్నా ప్రిన్సిపాల్ ను తొలగించాలని ఎమ్మెల్యేకి వివరించామని అన్నారు. అదే విధంగా చింతగట్టు, భట్టుపల్లి లో గిరిజన భవనాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తీసుకొచ్చి గిరిజన కోచింగ్ సెంటర్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఐటిడిఏ పీఓ, డీటీడీవో గార్లకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఆశోకకాలనీలో ఉన్నా ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవనంలో నాలుగు రూంలు గిరిజన శాఖ కోచింగ్ సెంటర్ అభ్యర్థులు వాడుకోవడంతో విద్యార్థులకు గదులు సరిపడక ఇబ్బందులు పడుతుంటే కూతవేటు దూరంలోని ఉన్న ఐటిడిఏ అధికారులకు కనిపించడం లేదా అని అన్నారు.
గత పన్నెండు సంవత్సరాల నుండి డిప్యూటేషన్ పై ఐటిడిఏ కార్యాలయంలో, కోచింగ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యాదాద్రి జోన్ లో పని చేయాల్సిన గెజిటెడ్ హెచ్ఎం భద్రాద్రి జోన్ లో కొద్దిగా పైరవీలు చేసుకోని డిప్యూటేషన్ ఆర్డర్ తీసుకోని పని చేస్తున్నారని గుర్తు చేశారు. హన్మకొండ నగరంలోని చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు ఎస్టీ పోస్ట్ మెట్రిక్ కాలేజీ హాస్టల్లో అడ్మిషన్ ఇవ్వడం లేదని...
ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గిరిజన కోచింగ్ సెంటర్ వేరే చోట మార్చి, ఎస్టీ హాస్టల్ పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అజ్మీరా వెంకట్, బిఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి , గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భానోత్ భాస్కర్ నాయక్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.