సార్వత్రిక స*మ్మె విజయవంతానికి కృషి చేయాలి
అఖిలపక్ష సమావేశంలో ధనుంజయ నాయుడు విజ్ఞప్తి
9వ్యూస్, నేరేడుచర్ల మండలం, జులై 06: ఈ నెల తొమ్మిదో తేదీన జరగనున్న సార్వత్రిక స* విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు..
సోమవారం నాడు నేరేడుచర్ల లోని సిపిఎం కార్యాలయం జరిగిన ఏఐటియుసి, సిఐటియు, టి యు సి ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమాఖ్య,కేవిపీఎస్ ఏఐవైఎఫ్ సంయుక్త సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...
రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానానికి స్వస్తి పలకాలని, కేంద్రంలో అధికారులు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విదేశీ బ్యాంకులలో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెస్తావని అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కల్పిస్తావన్నమాట బుట్ట దాఖలయిందని అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆయన ధ్వజం ఎత్తారు.
వామపక్ష పార్టీలు సాధించుకున్న మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని అందుకే ప్రతి బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తున్నారని కానీ కేంద్రం ఆటలు సాగనీయ బోమని ఆయన హెచ్చరించారు..
సమావేశానికి సీఐటీయూ మండల అధ్యక్షుడు నీల రామ్మూర్తి అధ్యక్షత వహించగా, పట్టణ సిపిఎం కార్యదర్శి కొదమగుండ్ల నగేష్,, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ లక్ష్మి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఇంజమూరు వెంకటయ్య సిపిఐ ఎంఎల్ డివిజన్ కార్యదర్శి వాసా పల్లయ్య టియుసిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వరరావు ఏఐటియుసి నాయకులు ముత్యాల భాస్కర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం అంబటి భిక్షం చందమల్ల నవీన్ బుద్ధ సంతోష్ కృష్ణవేణి పాల్గొన్నారు