టి. బి. ముక్త్ భారత్ అభియాన్ విజయంతం చేద్దాం :డాక్టర్ జులేఖ బేగం

 టి. బి. ముక్త్ భారత్ అభియాన్ విజయంతం చేద్దాం :డాక్టర్ జులేఖ బేగం 


9వ్యూస్, చింతపర్తి, జులై 07:టి. బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమమును విజయవంతం చేద్దామని చింతపర్తి పి. హెచ్. సి.వైద్యులు డాక్టర్ జులేఖ బేగం అన్నారు.



 టి. బి. ముక్త్ భారత్ అభియాన్ 100రోజుల కార్యక్రమం లో భాగంగా కూరపర్తి గ్రామం లో నిర్వహిస్తున్న 104 సేవలలో భాగంగా డాక్టర్ జులేక బేగం ఆధ్వర్యంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ టి. బి. వ్యాధి పై ప్రజలకు అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది అన్నారు. 


ఈ కార్యక్రమం లో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పొగత్రాగు వారిని, మద్యం సేవించు వారిని, గతం లో టి. బి. జబ్బు వచ్చి భాగైన వారిని, హెచ్. ఐ. వి. పాజిటివ్ వారిని, బి. ఎమ్. ఐ 18 కంటే తక్కువ ఉన్న వారిని, గర్భవతులను, షుగర్ ఉన్న వారిని గుర్తించి వారికి గళ్ళ పరీక్షలు నిర్వహించి, వారికి పాజిటివ్ వచ్చిన యెడల ఆరు నెలల చికిత్స ఉచితంగా ప్రారంభించడం జరుగుతుంది అన్నారు. 



చికిత్స సమయం లో రోగి ఖాతా లో రు 1000/-జమ చేయడం జరుగుతుంది అన్నారు. 


మంచి పౌష్టికాహారం తీసుకోవడం కోసం ఈ పైకం వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నారు. అనంతరం నినాదాలు చేస్తూ, ప్లాకార్డ్స్ ప్రదర్శన చేస్తూ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. 


ఈ కార్యక్రమం లో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఏ. ఎన్. ఎమ్.ధనలక్ష్మి, ఆశాకార్యకర్తలు 104 పైలెట్ కేశవ, ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.