చేపట్టిన వృత్తిలో సంతృప్తిని పొందా : ఉద్యోగ విరమణ కార్యక్రమంలో చంద్రశేఖర వరప్రసాద్.
9 Views : చింతపల్లి/ జికే వీధి :- నేను చేపట్టిన ఉపాధ్యాయ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పి ఈ టి) వృత్తిలో సంతృప్తిని పొందానని జెరెల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం చంద్రశేఖర వరప్రసాద్ అన్నారు.
జెర్రెల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్న ఆయన సోమవారం (జూన్ 30) ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దెల బాలన్న నారాయణమ్మల ఐదవ సంతానంగా జన్మించిన తాను ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను లోతుగెడ్డ, చింతపల్లి లలో పూర్తి చేశానన్నారు.
అదే క్రమంలో ఇంటర్మీడియట్ చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేయడం జరిగిందన్నారు అనంతరం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ శిక్షణ పొంది 1996లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ముంచంగు పుట్టు పాఠశాలలో ఉద్యోగంలో చేరడం జరిగిందన్నారు.
నాటినుండి కొక్కిరాపల్లి చింతపల్లి కేంద్రీకృత ఆశ్రమ వసతి గృహ పాఠశాల, అదే క్రమంలో చింతపల్లి బాలుర ఆశ్రమ వసతి గృహ పాఠశాల 2, లలో పని చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో 2018లో ఫిజికల్ డైరెక్టర్ గా పదోన్నతి కల్పించి నుర్మతి బాలికల ఆశ్రమ వసతి గృహ పాఠశాలకు బదిలీపై వెళ్లడం జరిగిందన్నారు.
2023లో జీకే విధి మండలం జరెల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ వసతి గృహ పాఠశాలకు బదిలీ కావడం జరిగిందని ఈ క్రమంలో జూన్ 30న ఉద్యోగ విరమణ పొందడం జరిగిందన్నారు. 29 ఏళ్ల పాటు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గాను, ఫిజికల్ డైరెక్టర్ గాను సేవ చేయడం సంతృప్తిని కలిగించిందన్నారు.
తన వద్ద విద్యనభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు నేడు వివిధ పాఠశాలల్లో, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గా, ఫిజికల్ డైరెక్టర్లుగా అనేక రంగాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని, అది తనకెంతో గర్వకారణం అని ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుమ్మరి సింహాచలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం తనకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగించిందన్నారు.
ఉద్యోగ విరమణ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తమ దంపతులను (చంద్రశేఖర వరప్రసాద్ రాణి) గజమాల, దుస్సాలు వాలతో సత్కరించి తన సేవలను కొనియాడడం తమకెంతో ఆనందం కలిగించిందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గసాడి పద్మనాభం, బి కృష్ణారావు, ఎస్ విజయ్ కుమార్, సిహెచ్ శేఖర్, జీ రమేష్, బి చిన్నబ్బాయి, కోటి భద్రం పడాల్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయ యూనియన్ నాయకులు కుడుముల వెంకటరమణ, ఎం వెంకటరమణ లు హాజరయ్యారని, తన ఉద్యోగ విరమణ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.