కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి - సిఐటియు

కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి - సిఐటియు


ఎన్టీఆర్ జిల్లా,మైలవరం, జూలై 7,(9వ్యూస్): దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ జరుగుతున్న సమ్మె కరపత్రాలను ఆవిష్కరించిన రైతు బజార్ మార్కెట్ కార్మికులు అధ్యక్షులు పులపాక చంటి బాబుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ



 కార్మికులు బరువులతో ఎంతో కష్టపడి జీవనం సాగిస్తున్నారని 70 నుంచి 100 కేజీల మూట్లు మోస్తూ తమను అడుగులు పోతున్నాయని అయినప్పటికీ ప్రభుత్వాలు ముటారంగ కార్మికులను పట్టించుకోవడంలేదని వాపోయారు.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మికులకు లేబర్ వెల్ఫేర్ బోర్డు పునరుద్దించాలని కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.


9వ తేదీ కార్మికులంతా ఐక్యంగా సమ్మెలో పాల్గొంటున్నట్లు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోర్లమూడి జోజి వంగూరి ప్రకాష్ మల్లాది నాగేశ్వరరావు, పులపాక సచిన్ కొర్లమూడి ఆర్య పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.