బీసీ వర్గాలకు సముచిత స్థానం కాంగ్రెస్ తోనే సాధ్యం... కాంగ్రెస్ అగ్ర నేతల చిత్రపటాలకు పాలాభిషేకం..
9వ్యూస్ డిజిటల్ న్యూస్... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జులై 12 : స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు
నెరవేర్చ దిశగా రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హర్షిస్తూ ఉప్పల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
చిల్కానగర్ చౌరస్తాలో ఉప్పల్ నియోజకవర్గ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అకిటి ఆగం రెడ్డి ఆధ్వర్యంలో
అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించే దిశగా ఇచ్చిన హామీ మేరకు స్థానిక ఎన్నికలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించే దిశగా
చట్టసభలు తీర్మానం చేయడానికి అమలకు సిద్ధంగా ఉందని ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అన్నారు.
అకీటి మాధవరెడ ఆధ్వర్యంలో ఉప్పల్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలకల మోహన్ రెడ్డి కొంపల్లి బాలరాజ్ జగన్నాథ్ గౌడ్
యూత్ కాంగ్రెస్ నాయకులు పల్నాటి డేవిడ్ ,రమేష్ శ్రీనివాస్ సతీష్ చిల్కానగర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.