ఐఐటీ సీట్లు పొందిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఘన విద్యార్థులకు సన్మానం
9వ్యూస్ డిజిటల్ న్యూస్ నేరేడుచర్ల మండలం, జులై 12:లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో..
ఇటీవల జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సిఎస్‌ఇ సీటు పొందిన బట్టు ఆశ్రితవల్లి, ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ సీటు పొందిన రమావతి సుకుమార్,
IIIT బాసర సీటు పొందిన జడ్పీహెచ్ఎస్ పెంచిపెంచికల్‌దిన్న పాఠశాలకు చెందిన సద్దల గీతిక లను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన గీతికకు లయన్స్ క్లబ్ తరఫున రూ. 8000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది .
క్లబ్ అధ్యక్షులు లయన్ గుండ్రెడ్డి సైదిరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "లయన్స్ క్లబ్ ఎప్పుడూ సేవా ధోరణితో ముందుంటుంది.
ముఖ్యంగా ప్రతిభను ప్రోత్సహించేందుకు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మద్దతుగా నిలవడమే మా లక్ష్యం," అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ మధు,ప్రభాకర్ రెడ్డి, జడ్పీహెచ్ఎస్ పెంచికల్ దీన్నే ప్రధానోపాధ్యాయులు ఎల్ శ్రీనివాసరావు, క్లబ్ కార్యదర్శి షేక్ యూసుఫ్,
కోశాధికారి నాగేశ్వరరావు సరికొప్పుల, సీనియర్ సభ్యులు శ్రీరామ్ రెడ్డి, కందిబండ శ్రీనివాస్ రావు, , గుండా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..