చెట్లను పెంచి కాపాడండి
9 views డిజిటల్ న్యూస్ కాజీపేట జూలై 10 :కాజిపేట్ లోని వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లో
అలాగే గోశాల ఆవరణలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ నార్ల గిరి రామలింగం ఆధ్వర్యంలో పర్యావరణాన్ని రక్షించాలని
ఉద్దేశంతో సురేష్ దంపతులు మొక్కలను అందజేశారు..
ఈ సందర్భంగా నార్లగిరి రామలింగం మాట్లతూ.....వృక్షో రక్షతి రక్షితః" అనేది ఒక సంస్కృత శ్లోకం,
దీని అర్థం "చెట్లను రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి". ఇది ప్రకృతిని, ముఖ్యంగా వృక్షాలను రక్షించాల్సిన అవసరాన్ని గుర్తుచేసే ఒక సూక్తి.
ప్రస్తుత జీవన విధానంలో ..చోటు చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులను చూస్తుంటే..
ప్రక్రుతి ఎప్పుడూ ఎలాంటి విపత్తు వస్తుందో అని భయం భయంగా జీవితం గడపాల్సి వస్తుంది అని
"వృక్షో రక్షతి రక్షితః" అనే సూక్తి ద్వారా, వృక్షాలను సంరక్షించడం ద్వారా,
మనం మన స్వంత జీవితాలను మరియు భవిష్యత్తును కూడా సురక్షితంగా ఉంచుకుంటామని
చెట్లు లేకపోతే, మనకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం ఉండవు, తద్వారా మానవ మనుగడ ప్రమాదంలో పడుతుంది అన్నారు.
మొక్కలను కుటుంబ సభ్యులతో సురేష్ దంపతులు లతో నటించారు...
ఈ కార్యక్రమానికి మార్కెట్ అధ్యక్షుడు నిషాని బిక్షపతి కుమార్ ,నాగరాజు, కొమరమ్మ ,విలేకరి ,రాజేశ్వరి, స్వరూప ,రామక్క ,వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.