శుక్రవారపు వేళ శ్వేత వారాహి పూజలు
9వ్యూస్ సూర్యాపేట సాంస్కృతికం, జులై 04
ఆషాడమాసంలో విశేషమైన శ్రీవారాహి నవరాత్రి ఉత్సవములలో బాగంగా శ్రీ సంతోషి మాత దేవాలయం లో శుక్రవారం 9 వ రోజు శ్వేతవారాహి దేవి గా అమ్మవారు పూజలు అందుకున్నది.ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో భాగముగా అమ్మవారిని ప్రత్యేకంగా కుంకుమార్చన నిర్వహించారు. శ్వేత వారాహి దేవి అమ్మవారి విశిష్టత భక్తులకు తెలియజేశారు. పూజల అనంతరం మహిళలు హారతులు ఇస్తూ అమ్మవారికి కీర్తిస్తూ పాటలు పాడారు.
*నేడు(శనివారం) మహా వారాహి పూజలు*
శ్రీ వారాహి నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు(శనివారం) మహా వారాహి పూజలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఉదయం 8 గంటలకు మహా వారాహి పూజ, 10 గంటలకు సామూహికంగా అమ్మవారికి వడి బియ్యం కార్యక్రమం, ఆ తదనంతరం మహాగణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ, కాలభైరవ సహిత వారాహి మాత మూల మంత్ర హోమం నిర్వహించి భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ అద్యక్షులు నూక వెంకటేశ్వం గుప్తా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.