పాఠశాల నుండే విద్యార్ధులువిద్య నైపుణ్యాలను పెంచుకోవాలి

 పాఠశాల నుండే విద్యార్ధులువిద్య నైపుణ్యాలను పెంచుకోవాలి



9వ్యూస్, సూర్యాపేట, జులై 04: పాఠశాల నుండే విద్యార్థులు విద్యా నైపుణ్యాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష మంది విద్యార్ధులను కలిసి వారి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో యువ వికాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మొదటి లయన్స్ క్లబ్ వైస్ డిస్టిక్ గవర్నర్ కె .వి ప్రసాద్ తెలిపారు. 


శుక్రవారం సూర్యాపేట లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. 



రానున్న రోజుల్లో ఉద్యోగ సమపాధనలో పోటీ తత్వం విపరీతంగా పెరిగిపోతుందని నైపుణ్యాలు పెంపొందించుకున్న వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని తెలిపారు.పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు మా క్లబ్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. 


వ్యక్తిత్వ వికాస శిక్షకులు పూర్ణ శశికాంత్ పిల్లలకు లక్ష్యాలను నేర్పరచుకోవడం ,వాటిని ఎలా సాధించాలో పూర్తి స్థాయిలో శిక్షణ ను ఇచ్చారు. 


లయన్స్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షులు మిరియాల సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువ వికాస్ కోఆర్డినేటర్ యరమాద శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ యువ వికాస్ యూత్ లీడర్ స్కూల్ ఎడ్యుకేషన్ నూకల వెంకట రెడ్డి డిస్టిక్ గ్లోబల్ మెంబర్షిప్ కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వరరావు, జోన్ చైర్మన్ కొండ లక్ష్మారెడ్డి, రీజియన్ చైర్మన్ కొండ సంతోష్ లయన్స్ క్లబ్ కార్యదర్శి గుండా లక్ష్మయ్య కోశాధికారి పాశం అనంతరావు, స్కూల్ ఇన్చార్జి హెడ్మాస్టర్ సునీత 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.