సుధా బ్యాంక్ రుణమేళాను సద్వినియోగం చేసుకోవాలి

సుధా బ్యాంక్ రుణమేళాను సద్వినియోగం చేసుకోవాలి


_ 16 రకాల రుణాల మంజూరు

_ కాలయాపన లేకుండా తక్షణమే రుణాల మంజూరు

_ సుధా బ్యాంక్ ఎండీ పెద్దిరెడ్డి గణేష్


9views, సూర్యాపేట టౌన్, జూన్02 : సుధా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రుణమేళాను సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సుదా బ్యాంక్ ఎండీ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు.


బుధవారం జిల్లా కేంద్రంలోని సుధా బ్యాంకు వద్ద నిర్వహిస్తున్న రుణమేళాలో పాల్గొని మాట్లాడారు.సుధా బ్యాంక్ ఆధ్వర్యంలో 16 రకాల రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. 



ఈ రుణమేళాలో వివిధ రకాల రుణాలను సులభంగా పొందేందుకు బ్యాంకు మేనేజర్, సిబ్బందిని కలిస్తే వారి అవసరాల మేరకు కాలయాపన చేయకుండా రుణాలను మంజూరు చేస్తారని తెలిపారు.


రుణాల కోసం వివిధ బ్యాంకులకు వెళితే అప్లికేషన్ తీసుకొని పలు రకాల కారణాలతో నెలల తరబడి తిప్పుతున్న సందర్భంలో స్థానికంగా ఉన్న సుధా బ్యాంక్ ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రజలతో సత్సంబంధాలు ఉండటంతో వారంలో రుణాలు మంజూరు చేస్తామన్నారు.


 అత్యవసరమైతే రెండు మూడు రోజుల్లో కూడా రుణాల మంజూరుకు సహకరిస్తామన్నారు. ఇంటి మరమ్మత్తులకు, విస్తరణకు, చిరు వ్యాపారాలకు, దుకాణదారులకు, చేతి పనివృత్తిదారులకు 12 శాతం వడ్డీతో రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 


టర్మ్ లోన్లు, వాహన రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, గిడ్డంగి సర్టిఫికెట్ రుణాలు, బంగారు ఆభరణాలపై కూడా రుణాలు ఇస్తామన్నారు.ఈ రుణామేళాను సద్వినియోగం చేసుకొని ప్రజలు, ఖాతాదారులు వారి అభివృద్ధితో పాటు బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.


ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ పతాని సైదులు, ఫీల్డ్ ఆఫీసర్ మేకల కేశవులు, సిబ్బంది మారినేని నవీన్, ప్రజలు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.