అర్హతనే కొలమానంగా ఇందిరమ్మ ఇళ్లు

 అర్హతనే కొలమానంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం…


9 views డిజిటల్ న్యూస్ జూలై 12:వరంగల్ మండల పరిధిలో ఉన్న రెండు డివిజన్ ల


 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,


రామన్నపేటలోని మణిద్వీప్ ఫంక్షన్ హాల్ లో వరంగల్లు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 11 వ మరియు 29 వ డివిజన్ లలోని 39 మంది..


 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇళ్ల మంజూరు పట్టాలను పంపిణీ..


 చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి.



పశ్చిమ నియోజకవర్గానికి మొత్తం 3500 ఇళ్లని మొదటి విడతలో కేటాయించామని..


 అర్హతను కొలమానంగా తీసుకుని ఎంపిక ప్రక్రియ చేస్తున్నామని ఎమ్మెల్యే నాయిని తెలిపారు.


వరంగల్ మండల పరిధిలో ఉన్న రెండు డివిజన్లలో అప్లికేషన్ పెట్టుకున్న వారి జాబితాను పారదర్శకంగా ఎంపిక చేశామని చెప్పారు.



 ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని 200 యూనిట్ ల


 ఉచిత విద్యుత్,ఉచిత బస్ ,గ్యాస్ సబ్సిడీ,డ్వాక్రా ద్వారా వీడిలేని రుణాలు


 వంటి కుటుంబ అభివృద్ది కొరకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారాని అన్నారు.


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ విజయ లక్ష్మి సురేందర్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ,


బ్లాక్ అధ్యక్షులు సంపత్,లక్ష్మారెడ్డి,ఆలయ డైరెక్టర్ పూర్ణ,డివిజన్ అధ్యక్షులు సంగీత్,క్రాంతి,అస్గర్ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.