జన హృదయ నేతకు అయినవోలు మండల కేంద్రంలో ఘనంగా జయంతి వేడుకలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్బంగా ఈ రోజు అయినవోలు మండల కేంద్రంలో వై ఎస్ ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
9వ్యూస్ డిజిటల్ న్యూస్ ,ఐనవోలు మండలం, జులై 08: ఈ సందర్భముగా కాంగ్రెస్ పార్టీ అయినవోలు మండల ప్రధాన కార్యదర్శి ఎండి రఫీ మాట్లాడుతూ మహానేత,మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు అమోఘం అని అన్నారు.
ఆయన సీఎంగా ఉన్న రోజులు ఆయన రూపొందించిన పథకాలు దేశానికే దిక్సూచీల మారాయని,ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ పథకం,రైతులకు ఏక కాలంలో పంట రుణమాఫీ,104,108అత్యవసర వైద్య సేవలు,ఆరోగ్య శ్రీ,ఇందిరమ్మ ఇండ్లు పథకం,అత్యున్నత పథకాలతో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని పెంచి,దేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడిగా మన్ననలు పొందాడని కొనియాడారు.
ఆయన వ్యూహాత్మకంగా,ప్రతిష్టాత్మకంగా,ప్రణాళిక బద్దంగా చేసిన ప్రతి ఒక్క పథకం విజయవంతమై పేదల పాలిట పెన్నిధి వై.ఎస్.ఆర్.అయ్యారని అన్నారు.
ఇవ్వాళ మహానేత వై.ఎస్.ఆర్.76వ జయంతి సందర్భముగా వారికి మా ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ...
ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కొత్తూరు ప్రతాప్ మండల యూత్ జనరల్ సెక్రెటరీ బరిగెల భరత్"ఖన్ని"గడ్డం శ్రీకాంత్ గౌడ్ దేవస్థాన ధర్మకర్త పెండ్లి సంపత్ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులుచింత అశోక్ కొనకటి శంకర్ రెడ్డి గ్రామ యూత్ అధ్యక్షులు తాటికాయల ప్రశాంత్ అద్దంకి రమేష్ రాజయ్య రాజిరెడ్డి రఘు కనక రత్నం తదితర నాయకులు పాల్గొన్నారు.