టూరిజం శాఖకే వన్నెతెచ్చిన పటేల్ రమేష్ రెడ్డి
9వ్యూస్ డిజిటల్ న్యూస్,సూర్యాపేట, జులై 08: తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధి చేశారని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్,సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు గట్టు శ్రీనివాస్ గుప్త తెలిపారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో గల పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి పటేల్ రమేష్ రెడ్డికి తినిపించి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో పటేల్ రమేష్ రెడ్డి కార్పొరేషన్ పదవి చేపట్టి తెలంగాణను టూరిజం హబ్ గా మారుస్తున్నారని కొనియాడారు.
పురాతనమైన ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధి తో పాటు సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ కు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్.ఊర రామమూర్తి యాదవ్,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ముదిరెడ్డి రమణా రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్ మాజీ కౌన్సిలర్లు వెలుగు వెంకన్న,నిమ్మల వెంకన్న,తండు శ్రీనివాసు గౌడ్,వల్దాసు దేవేందర్, యాట ఉపేందర్,పిల్లల రమేష్ నాయుడు,కుంచం అంజయ్య తదితరులు పాల్గొన్నారు..