ఘనంగా మహానేత వైయస్సార్ జయంతి వేడుకలు
9వ్యూస్ డిజిటల్ న్యూస్ ఉమ్మడి జిల్లా బ్యూరో, పీలేరు,జూలై 8: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల మన్ననలు పొందిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు ఎంతో ఆత్మీయతతో, ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ వేడుకలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు వెళ్లి, డాక్టర్ వైఎస్సార్ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీరితోపాటు పీలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం బాల్రెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక ప్రజాప్రయోజన పథకాలను అమలు చేశారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలుకు ఉచితంగా వైద్యం అందేలా చేశారు.
రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు అమలుచేసి విద్యా, వ్యవసాయ రంగాలను బలోపేతం చేశారు. ఆయన ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామీణాభివృద్ధికి గొప్ప ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన సేవలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని సోమశేఖర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను నిర్వహించారు.