10న సిపిఎం మండల స్థాయి శిక్షణ తరగతులు
9వ్యూస్ డిజిటల్ న్యూస్, నేరేడుచర్ల, జూలై 09: ఈనెల 10న సిపిఎం పార్టీ నేరేడుచర్ల మండల స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేరేడుచర్ల మండల సిపిఎం పార్టీ కార్యదర్శి సిరికొండ శ్రీను అన్నారు.
పెంచికల్ దిన్న సిపిఎం కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో పార్టీ చేపట్టే ప్రజా ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఎం నాయకులు మరి నాగేశ్వరరావు అల్వాల శ్రీధర్ మామిడి నాగ సైదులు కట్ట మధుబాబు బుడిగ ధనుంజయ మచ్చ సోమయ్య సిరికొండ చిన్న శీను బొప్పన విలోచన రాణి పాలకూరి రాములమ్మ పర్సనబోయిన సైదులు ముడుపు దేవయ్య తదితరులు పాల్గొన్నారు.