ఆదర్శ ఉపాధ్యాయని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల హెచ్ఎం కొండ్ర మంజుల

ఆదర్శ ఉపాధ్యాయని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల హెచ్ఎం కొండ్ర మంజుల



9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా కాజీపేట జూలై 03 : కడిపికొండ ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల హెచ్ఎం కొండ్ర మంజుల స్కూలు పిల్లలకు తన సొంత ఖర్చులతో బెల్టు, టై,స్పోర్ట్స్ డ్రెస్సులను,అందించినారు .



ఉపాధ్యాయకు పిల్లల పట్ల వారి  ఉన్న శ్రద్ధనకి అభినందించినారు. మన పాఠశాలలో నాణ్యమైన ఆహారము మరియు ఇతర సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్న దృశ్య ప్రైవేట్ పాఠశాలలకు పోయే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని గ్రామ ప్రజలను ఆర్గనైజ్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్య తీసుకోవాలని పాఠశాల సిబ్బందిని గ్రామ ప్రజల సహకారంతో చైతన్యపరచాలని పాఠశాల ఉపాధ్యాయులను కోరినారు. 


మంచి  మనసుతో  ముందుకు వచ్చిన పాఠశాల ఉపాధ్యాయులను అభినందించినారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ లత,ఉపాధ్యాయులు సుంచు కాల లింగారావు .


 జమీల బేగం, సుభద్ర  మరియు శ్రమశక్తి అవార్డు గ్రహీత మరియు శ్రామిక రత్న బాస్కె దశరథం పాల్గొని అభినందించినారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పాలని ఉపాధ్యాయులను కోరినారు. 


మన పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నందున గ్రామ ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలు చదివించాలని విజ్ఞప్తి చేసారు. పాఠశాలల్లో ప్రభుత్వం వారు పుస్తకాలు బట్టలు మధ్యాహ్న భోజనము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నరని. కనుక  పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.