60 మీటర్ల గ్రావెల్ రోడ్డు నిర్మాణం
జనతా శ్రేయస్సుకు కట్టుబడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు, గ్రామస్థులు
చింతపల్లి (9 views) : మండలంలోని పెదబరడ పంచాయతీకి చెందిన లోతుగడ్డ జంక్షన్
గ్రామస్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు రాజకీయాలకు అతీతంగా నేతలు, ప్రజలు కలిసికట్టుగా పరిష్కారం చూపించారు.
గ్రామ ప్రజల కష్టాలను గుర్తించి, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూటమి నాయకులు ముందుకు వచ్చారు.
గత కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తున్న 60 మీటర్ల గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులను స్వయంగా చేపట్టి ప్రజల మన్ననలు పొందారు.
జనసేన పార్టీ పెదబరడ అధ్యక్షుడు కూడా రామకృష్ణ, కూటమి నాయకులు
టీడిపి గెమ్మెలి మహేష్, గెమ్మెలి రమణ, పాంగి లక్ష్మణరావు, డుంబ్రిగూడ అబ్జర్వర్ పాంగి రాము తమ నాయకత్వ లక్షణాలను చాటుకున్నారు.
వీరితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ గెమ్మెలి రాజేశ్వరితో పాటు గ్రామస్థులైన రమణ బాబు, చిట్టిబాబు,
పండా చిన్న, సూరిబాబు, లోవరాజు, జీవి రమణ, మట్టా లక్ష్మి, భవాని తదితరులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పాలకుల నిర్లక్ష్యంతో మూలనపడిన ఈ సమస్యను గుర్తించి, అందరూ కలిసి శ్రమదానం చేసి రోడ్డును పూర్తి చేశారు.
ఈ సామూహిక కృషి వల్ల గ్రామంలో రవాణా మెరుగుపడిందని, ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి నేతల చిత్తశుద్ధిని, గ్రామస్థుల సహకారాన్ని ఈ నిర్మాణం స్పష్టం చేసిందని పలువురు ప్రశంసించారు.