రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షులు జంగా
9views digital News హన్మకొండ జూలై 12: రాష్ట్ర క్రీడా చరిత్రలో తొలిసారిగా సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ కు..
ఖాజీపేట ఆతిథ్యమివ్వనున్నట్లు తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ ,రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి తెలిపారు.
ఈ మేరకు వరంగల్ జిల్లా ఖో ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని శ్యామల గార్డెన్ లో ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్..
కమిటీ కన్వీనర్ గా,సౌత్ జోన్ ఖో ఖో అసోసియేషన్ చైర్మన్ ఎన్నికైన జంగా రాఘవరెడ్డి,కేకేఎఫ్ఐ ఉపాధ్యక్షులు సీతారాంరెడ్డి,కేకేఎఫ్ఐ కార్యవర్గ సభ్యులు...
ఎన్, కృష్ణమూర్తి,ప్రసాద్, సౌత్ జోన్ ఖో ఖో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వై మహేందర్ రావుల సన్మాన కార్యక్రమం జరిగింది...
ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఖో ఖో ఫెడరేషన్ లో ప్రతిష్టాత్మకమైన ఎథిక్స్ కమిటీ కన్వీనర్ల తన ఎన్నికకు సహకరించిన..
ఖోఖో ఫెడరేషన్ బాధ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం తో పాటు దేశంలో..
క్రమశిక్షణ తో కూడిన ఖోఖోను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు.
జాతీయస్థాయి వేదికగా తెలంగాణ క్రీడాకారులు రాణించేందుకు దాదాపు 12 లక్షలతో ఖోఖో మ్యాట్లను అందించినట్లు చెప్పారు.
పర్యవసరంగా సబ్ జూనియర్ నేషనల్లో మన రాష్ట్ర జట్టు రజత పతకం సాధించినట్లు చెప్పారు.
ఖోఖో తోపాటు మిగతా క్రీడల అభివృద్ధికై ఉనికికిచర్ల సమీపంలో ఎమ్మెల్యే కడియం సహకారంతో మినీ స్టేడియం తో పాటు క్రీడా పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ విషయమై త్వరలో ముఖ్యమంత్రి క్రీడా సంఘాల ఆధ్వర్యంలో కలవనున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వం క్రీడారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ప్రజా ప్రభుత్వంలో బడ్జెట్లో క్రీడా రంగానికి 465 కోట్లు కేటాయించినట్లు తెలిపారు..
గత ప్రభుత్వం నుండి క్రీడా సంఘాలకు అందించవలసి ఉన్న 12 కోట్లను ప్రభుత్వం ద్వారా అందించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు.
ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీతారామిరెడ్డి మాట్లాడుతూ స్వల్ప వ్యవధిలోనే...
ఖో ఖో క్రీడాభివృద్ధికీ విషేశంగా కృషిచేసిన జంగా రాఘవరెడ్డి నేతృత్వంలో దక్షిణ భారతదేశంతోపాటు దేశంలో ఖోఖో క్రీడ గణనీయంగా అభివృద్ధి చెందినున్నట్లు చెప్పారు.
సమర్ధుడైన జంగాకు ఈ పదవి వరించిందన్నారు. జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీలను..
విజయవంత నిర్వహణకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం అందించనున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ...
గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కీలక పదవులను లభించడం సంతోషదాయకమన్నారు...
ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో రాష్ట్రంలో ఈ క్రీడా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
జంగా రాఘవరెడ్డి నేతృత్వంలో జాతీయస్థాయి పోటీలను కనివిని ఎరగని రీతిలో నిర్వహించినట్లు చెప్పారు.
అనంతరం వరంగల్ జిల్లా ఖోఖోఅసోసియేషన్ తో పాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోకో అసోసియేషన్లు,తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్,అథ్లెటిక్స్,రెజ్లింగ్...
జూడో అసోసియేషన్ ల ఆధ్వర్యంలో జంగా రాఘవరెడ్డిని సన్మాన పత్రాలు,జ్ఞాపికలు అందజేసి గజమాలలతో ఘనంగా సన్మానించారు.
జంగా రాఘవరెడ్డి తో పాటు మిగతా పదవులకు ఎంపికైనా సీతారామిరెడ్డి కృష్ణమూర్తి ,ప్రసాద్ మహేందర్ రావు లను అతిధులు సన్మానించారు.
ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిటీ కన్వీనర్ గా,సౌత్ జోన్ ఖో ఖో అసోసియేషన్ చైర్మన్గా..
ఎన్నికైన జంగా రాఘవరెడ్డి సన్మాన కార్యక్రమానికి క్రీడా సంఘాలతో పాటు క్రీడాకారులు,క్రీడా అభిమానులు,జంగా అభిమానులు...
నగరంలోని పలు డివిజన్లో తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశేషంగా తరలివచ్చారు..
అభిమానులు రాకతో సన్మాన కార్యక్రమం కోలాహలంగా మారింది. జంగాపై అభిమానంతో గజమాలలు జ్ఞాపికలతో...
సన్మాన కార్యక్రమం ఆధ్యాంతం ఉత్సాహంగా పూల వర్షంతో జంగాకు స్వాగతం పలుకుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ....
తెలంగాణ రాష్ట్ర ఖోఖో క్రీడాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఖోఖోఅసోసియేషన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కత్తి కుమారస్వామి, తెలంగాణ రాష్ట్ర జూడో సంఘం అధ్యక్షులు బి. కైలాసం యాదవ్...
తెలంగాణ అథ్లెటిక్స్,హ్యాండ్ బాల్,రెజ్లింగ్ అసోసియేషన్ ల ప్రధాన కార్యదర్శులు కే సారంగపాణి,శ్యామల పవన్ కుమార్, మహమ్మద్ కరీం,వరంగల్ జిల్లా క్రీడా సంఘాల బాధ్యులు...
పి రమేష్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి లిల్లీ ఫ్లోరెన్స్, సాంబశివరావు,ఖో ఖో అసోసియేషన్ బాధ్యులు రాజారపు రమేష్,సురేష్ , స్వప్న,రమణ తదితరులు పాల్గొన్నారు.