మొత్తం గ్రామం బీఆర్ఎస్ పార్టీలో చేరిక

పలికి గులాబీ పార్టీలో చేరికలు

మొత్తం గ్రామం బీఆర్ఎస్ పార్టీలో చేరిక

రానున్నది కేసీఆర్ ప్రభుత్వమే

ప్రచార పర్వమే కాదు ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టిస్తాం


9veiws digital news ఆదిలాబాద్ ,జులై 06 : టీఆర్ఎస్ పార్టీలో చేరిన అట్నం గూడ గ్రామస్తులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు

తాంసి మండలంలోని అట్నంగూడ గ్రామస్తులు గ్రామమంతా ఏకమై యువ నాయకులు జామిడి అశోక్ గారి నేతృత్వంలో ఈరోజు గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానంతో డప్పులు డ్యాన్సులు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. 


గ్రామస్తులు మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతీ సమస్యను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారిని చూసి గ్రామమంతా వారి వెంట బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. 

అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాధవ్  మాట్లాడుతూ తనను నమ్మి మొత్తం గ్రామమే పార్టీలో చేరినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. రానున్నది మన కేసీఆర్ ప్రభుత్వమే అని మంచి రోజులు వస్తాయని అన్నారు. 


 ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.