ఆదిలాబాద్ నుంచి గుడిహత్నూర్ వరకు 50 ఉన్న టికెట్ ను తగ్గిస్తూ 40 చేసిన tgrtc
9వ్యూస్, అదిలాబాద్ జిల్లా, జులై 07: ఆదిలాబాద్ నుంచి గుడిహత్నూర్ వరకు ఆర్టీసీ ఏకంగా రూ. 20 పెంచి ప్రయాణికుల వద్ద రూ. 50 వసూలు చేయడాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్ ఆవేదన వ్యక్తం చేస్తూ..
ఈనెల 3వ తేదీ గురువారం మీడియా ముందు మహాలక్ష్మి టికెట్ మగవారి దగ్గర వసూలు అనే శీర్షికతో ప్రశ్నించగా అనేక మంది ప్రయాణికులు ప్రశ్నించడాన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మీడియా నాయకులు మజర్ చేసిన ప్రకటనకు స్పందించిన ఆర్టీసీ గురువారం 50 ఉన్న టికెట్లను రూ. 10 తగ్గించి 40 కి చేసింది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మాట్లాడుతూ ప్రజల కోసం ఎల్లప్పుడూ ప్రశ్నిస్తామని ఇకనైనా ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకొని చార్జీలు పెంచడం అమయకులపై భారాన్ని మోపడం మానుకోవలన్నారు.