రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
9వ్యూస్ డిజిటల్ న్యూస్ ,సూర్యాపేట, జులై 11:బీసీలకు 42శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో
కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా,
ఉండ్రుగొండ గిరిదుర్గం చైర్మన్ డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద స్థానిక సంస్థల ఎన్నికల్లో
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలకు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నిరూపితమైందన్నారు.
గతంలో ఎన్నడు లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ
అన్ని వర్గాల ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు.
బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వెలుగు వెంకన్న, నిమ్మల శ్రీనివాస్, తండు శ్రీనివాస్ గౌడ్,
జ్యోతి కరుణాకర్, నేరెళ్ల మధు ఫారూఖ్, పిల్లల రమేష్ నాయుడు, యాట ఉపేందర్, యాట వెంకన్న,శ్రీధర్,ధర్మ తదితరులు పాల్గొన్నారు.