వివాహ నిశ్చితార్థ వేడుకల్లో శాసనసభ్యులు కృష్ణప్రసాదు
9veiws ,ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, మే21: వివాహ నిశ్చితార్థ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు.
మైలవరం నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అంకెమ్ సురేష్, టీడీపీ మహిళా విభాగం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి అంకెమ్ ఇందిరా ప్రియదర్శిని మేనకోడలు మానస, యశ్వంత్ కుమార్ వివాహ నిశ్చితార్థ వేడుకలు విజయవాడ సుజనా ది వెన్యూలో బుధవారం జరిగాయి.
ఈ నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.