గ్రీన్ టాక్స్ తగ్గింపుతో డ్రైవర్ల హర్షం
నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన లారీ యజమానులు
9veiws, ఉమ్మడి జిల్లా కరస్పాండెంట్,విజయవాడ, మే 21 : చిన్నాచితక ట్రాన్స్పోర్ట్ వాహనాల యజమానులకు, డ్రైవర్లకు భారంగా మారిన గ్రీన్ టాక్స్ తగ్గింపుతో ట్రాన్స్పోర్ట్ యజమానుల నుండి హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి.గతంలో గ్రీన్ టాక్స్ సుమారు 18000 ఉండేది,కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ట్రాన్స్పోర్ట్ వాహన యజమానుల విజ్ఞప్తి మేరకు 3 వేలకు తగ్గించారు.యువనేత నారా లోకేష్ పాదయాత్ర సమయంలో ట్రాన్స్పోర్ట్ యజమానులు ఆయనను కలిసి తమ బాధను విన్నవించుకున్నారు.గ్రీన్ టాక్స్ ఎంతో భారంగా మారిందని,దానివల్ల చిన్నా,చితక ట్రాన్స్పోర్ట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ ఆవేదనను వెల్లడించారు.ప్రభుత్వం ఏర్పడ్డాక న్యాయం చేస్తామని నాడు లోకేష్ హామీ ఇచ్చారు.ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో మంత్రి నారా లోకేష్ ప్రతిపాదన మేరకు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రీన్ టాక్స్ ను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం డాక్టర్ ఎన్టిటిపిఎస్ టిప్పర్ లారీ ఓనర్స్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కు ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కోయ వెంకట్రావు,ఉపాధ్యక్షులు లక్కిశెట్టి యాలాద్రి, సభ్యులు కొంక శ్రీనివాసరావు,మాదాల తిరుపతిరావు,ఏడుకొండల మంగపతి రావు,ఓనర్లు,డ్రైవర్లు పాల్గొన్నారు.