శ్రీ సంతోషిమాత దేవాలయంలో కొనసాగుతున్న వారాహి నవ రాత్రి పూజలు

శ్రీ సంతోషిమాత దేవాలయంలో కొనసాగుతున్న వారాహి నవ రాత్రి పూజలు


9views, సూర్యాపేట సాంస్కృతికం, జులై 02: ఆషాడమాసంలో విశేషమైన శ్రీవారాహి నవరాత్రి ఉత్సవములు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోషి మాత దేవాలయం ఘనంగా నిర్వహిస్తున్నారు. 



బుధవారం 7 వ రోజు మత్స్య వారాహి దేవి గా అమ్మవారు పూజలు అందుకున్నది.ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 



నవరాత్రుల్లో విశేషంగా ప్రత్యేకము గా పసుపు కొమ్ములతో అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య వారాహి దేవి అమ్మవారి విశిష్టత భక్తులకు తెలియజేశారు. భక్తులు అమ్మవారికి కీర్తిస్తూ పాటలు పాడారు.



ఈ కార్యక్రమంలో దేవాలయ అద్యక్షులు నూక వెంకటేశ్వం గుప్తా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ , కమిటీ సభ్యులు బజ్జూరి శ్రీనివాసు దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం దేవాలయ క్లర్క్ దులుసోజు జలంధర్ భక్తులు బ్రాహ్మ0డ్లపల్లి పల్లి శివ పార్వతి, 



గజ్జి నీలిమ,సారగుండ్ల సరిత,మనసాని అరుణ,పోలా విజేత, తెడ్ల ఉమామహేశ్వరి, నంద్యాల స్వాతి, పందిరి వరలక్ష్మి,బాణాల ధనలక్ష్మి, గరినే స్వాతి, ఊటుకూరీ కవిత, గరినే పార్వతి, తెడ్ల పల్లవి,సంతోష్ కుమార్,అంజన్ సాయి, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.