సుపరిపాలనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది - సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు

సుపరిపాలనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది - సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు 



9veiws digital news ప్రకాశం జిల్లా, జులై 05 : ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు " సుపరిపాలనలో తొలి అడుగు " కార్యక్రమం లో మార్కాపురం పట్టణం లోని 29 వ వార్డ్, మార్కాపురం మండలం లో రాయవరం గ్రామం, పొదిలి మండలం లో అన్నవరం గ్రామం, కొనకనమిట్ల మండలం లోని పెదారికట్ల గ్రామం లో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెడలి పాంప్లెట్లు పంచి భూత్ ఇన్చార్జిలతో మై టి డి పి యాప్ లో ఆ కుటుంబాల వివరాలు నమోదు చేయించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ఏడాదిలోని తమ హామీలకు కట్టుబడి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్న అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని ప్రతి విద్యార్థి తల్లులు ఎకౌంట్లో ఒక్కో విద్యార్థికి పదవులు వేల రూపాయలు జమ చేశారని అన్నారు.

 

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో వృద్ధులు వితంతువులకు నెలకు 4000 రూపాయలు, దివ్యాంగులకు 6000 రూపాయలు, కిడ్నీ కాలేయం తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకు 10000 రూపాయలు, పూర్తి వైకల్యం ఉన్నవారికి 15వేల రూపాయలు గా మొత్తం గా రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు.

తమ ఎలక్షన్ల హామీ అయినటువంటి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లు ఇస్తున్నారని అన్నారు.

యువతకు 16,347 పోస్టులతో డీఎస్సీ నియామకాలు త్వరలోనే చేపట్టబోతున్నారని, పోలీస్ శాఖలు నియామకాలు జరిపారని, పారిశ్రామిక రంగంలో 8.5 లక్షల మంది ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరిగాయని అన్నారు.


ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించబోతున్నారని అన్నారు.

 రైతు సంక్షేమం కొరకు కేంద్రంతోపాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ పథకం త్వరలోనే ప్రారంభం అవుతుందని అన్నారు.

 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి కేవలం ఐదు రూపాయలకే న్యాయమైన భోజనం అందిస్తున్నారని అన్నారు.


ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రానికి పలు బహుళ జాతి కంపెనీలను తీసుకువచ్చి వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేశారని అన్నారు.

గత వైసిపి పాలకులు పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, ఇంకా 4000 కోట్లు ఖర్చు చేస్తేనే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుందని త్వరలోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు.


త్వరలోనే ప్రత్యేక మార్కాపురం జిల్లా సకారం చేస్తామని అన్నారు.

టిడిపి శ్రేణులు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తీపి కొట్టాలని కార్యకర్తలకు సూచించారు.

 ఈ కార్యక్రమంలో ఆయా బూత్ ఇన్చార్జిలు, యూనిట్ ఇంచార్జి లు, క్లస్టర్ ఇంచార్జీలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.