విజయాంజనేయ స్వామికి వడమాల అలంకరణ
9views, సూర్యాపేట సాంస్కృతికం, జులై 01: జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ విజయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం అర్చకులు మరింగంటి వరదాచార్యులు స్వామికి వడ మాలతో అలంకరించి పూజలు చేశారు.
మంగళవారం కావటంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మండల్ రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన కార్యదర్శి నాగవేల్లి దశరథ గడ్డం ప్రతాప్ రెడ్ ఉపేంద్ర , ఆవుల జానయ్య పద్మ, మంచికంటి హనుమంతరావు , సామ వెంకటరెడ్డి, వీరబ్రహ్మచారి, పొదుగు సతీష్, దినేష్, శ్రీదేవి, మాధవి,శ్రీలత, శ్రావ్య,రవి శోభా తదితర భక్తులు పాల్గొన్నారు..