కాజీపేట చౌరస్తాలో భారతదేశ తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి 39వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాదిగ మహాజనుల వేదిక నాయకులు
9 view డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా జూలై 06 : దళితుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని పెయింటింగ్ మేస్త్రీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గబ్బెట ఎల్లేష్ పేర్కొన్నారు. ఆదివారం
కాజీపేట లో.. జరిగిన ఈ కార్యక్రమంలో..స్వాతంత్ర్య సమరయోధుడు,దళితుల ఆశాజ్యోతి,మాజీ భారత ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 39 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గబ్బెట ఎల్లేష్ మాట్లాడుతూ.. దేశ సమగ్రతకు, జాతి సమైక్యతకు కృషిచేసి భారత రాజ్యాంగానికి కాపలాదారుడుగా వ్యవహరించి అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి దేశానికి విశిష్ట సేవలు అందించిన జగ్జీవన్ రామ్ కు భారతరత్న బిరుదు ప్రకటించి గౌరవించాలని కోరారు ..ఈ కార్యక్రమంలో మాదిగ మహాజనుల వేదిక నాయకులుతదితరులు పాల్గొన్నారు.