టిఫిన్ బాక్సులు.. పంపిణీ కార్యక్రమం

 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా ఎస్ ఓ సి డబ్ల్యూ అసోసియేషన్ తరపున..

స్వెటర్స్ .స్పాంజ్ బాల్స్, క్రేయాన్స్, ఆర్ట్ అండ్. క్రాఫ్ట్ బుక్ లెట్, స్లిప్పర్స్ టిఫిన్ బాక్సులు.. పంపిణీ కార్యక్రమం.



9 వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్ డిసెంబర్ 03: కాజీపేట;ఈ రోజు కాజీపేట మండల విద్యా వనరుల కేంద్రంలో. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా ఎస్ ఓ సి డబ్లు అసోసియేషన్ వారు స్వెటర్స్ .స్పాంజ్ బాల్స్, క్రేయాన్స్, ఆర్ట్ అండ్. క్రాఫ్ట్ బుక్ లెట్, స్లిప్పర్స్ టిఫిన్ బాక్సులు.. పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రసిడెంట్ విన్సెంట్ ఓబ్రి మాట్లాడుతూ..

ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా,మా సంస్థ తరుపున మేము దివ్యాంగులు ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక అడ్డంకులను గుర్తించి, వారి హక్కులు, అవసరాలు మరియు సమాన అవకాశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి మా వంతు కృషి అందిస్తున్నాము. మా ఈ సంస్థ ద్వారా ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం కోసం మేము దాతల నుంచి సహాయం కోరుతున్నాం అని 

అలాగే దాతలు పరోక్షంగా కానీ ప్రత్యక్షం గా కానీ.. సహాయం చేసినట్టు అయితే మునుముందు . ఇలాంటి సేవ దృప్కాదం కార్యక్రమాలు చేస్తాం అని అన్నారు. ఈ నేపథ్యంలో మా సంస్థ ఈ రోజు 

ఏం ఈ ఓ,ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల .ఆధ్వర్యంలో లో దివ్యాంగులకు విద్యార్థులకు స్వెట్టర్లు చెప్పులు టిఫిన్ బాక్సులు స్కూల్ సామాగ్రి అందించారు.


*మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్, మాట్లాడుతూ... ..*

  సోల్స్ ఆఫ్ క్రిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరుగాలని, దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. అని అన్నారు.


*ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫ్రాన్సిస్. మాట్లాడుతూ...*

ఈ కార్యక్రమంలో దివ్యాంగల కు శీతాకాలంలో ఉపశమనాన్ని అందించేందుకు మృదువైన, నాణ్యమైన అందజేశారు. అలాగే, ప్రతిరోజూ పాఠశాల స్థలానికి తీసుకువెళ్లే ఆహారాన్ని సురక్షితంగా, శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడే టిఫిన్ డబ్బాలను కూడా పంపిణీ చేశారు. ఈ చిన్న సహాయం అయినప్పటికీ, ఇది వారి దైనందిన జీవితంలో ఎంతో ఉపయోగపడే అంశం.అని చెప్పారు.


*ప్రధానోపాధ్యాయుడు ప్రమోద్ మాట్లాడుతూ..*

 దివ్యాంగులు సమాజంలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. దివ్యాంగత ఒక అడ్డంకి కాదని, సరైన సహకారం లభిస్తే వారు కూడా ఏ రంగంలోనైనా శ్రేష్ఠత సాధించగలరని మాటల ద్వారా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం ద్వారా సమానత్వం, మానవతా విలువలు, సేవభావం వంటి గొప్ప లక్షణాలను సమాజానికి చాటి చెప్పారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మనందరికీ ఒక గుర్తు — దివ్యాంగులు మన సమాజంలో విడదీయరాని భాగం. వారికి గౌరవం, సహాయం, ప్రేమ అందించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ దుప్పట్లు మరియు టిఫిన్ డబ్బాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు కేవలం వస్తువుల పంపిణీగాక, వారి మనసుల్లో ఆనందం, ఆశ, నమ్మకం నింపే ప్రయత్నాలు. అని అన్నారు


అనంతరం ..

*డాక్టర్ రజనీ మాట్లాడుతూ..*

ఇంతటి ప్రత్యేక కార్యక్రమానికి అతిథిగా పిలవడం నాకు సంతోషం గా ఉంది అని యస్ ఓ సి డబ్లు ఎ వారికి నా వంతు సాయంగా భవిషత్ లో ఉచిత కౌన్సల్ట్ తో హెల్త్ చెకప్ చేస్తా అని చెప్పారు..


కార్యక్రమానికి హాజరైన అధికారులు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్, బాయ్స్ స్కూల్ హెడ్మాస్టర్ ఫ్రాన్సిస్, ప్రధానోపాధ్యాయుడు ప్రమోద్, ఎడ్యుకేటర్ భాగ్యలక్ష్మి, తిరుపతి, రవి, యశోద, డాక్టర్ రజని, ఎస్ఓసిడబ్ల్యు మెంబర్స్ విన్సెంట్, చైతన్య, ప్రసన్నకుమార్, గడ్డం ప్రసాద్, సిరి చందన, స్పాన్సర్ సురేష్ ఫుట్వేర్, పేరెంట్ పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.