ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహనం
కోరుట్ల, డిసెంబర్: 3 (9వ్యూస్) హిందు దేవి దేవతల పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవాం రోజు కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపెల్లి సాగర్ లు మాట్లాడుతూ కొత్త గూడెం పట్టణంలో సోమవారం రోజు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందు దేవుళ్ళను కించపర్చి మాట్లాడటం సిగ్గూచేటు అని అన్నారు. హిందువులకు వెంటనె బేషరతుగా క్షమాపణ చెప్పాలని దండ చేశారు. ఇలాంటి వాక్యాలు చేస్తే ఉరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సూదవేని మహేష్, తిరుమల వాసు, పోతుగంటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మాడవేని నరేష్, ఉపాధ్యక్షులు తోట రాజేశం, ముల్క ఆంజనేయులు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాడిగే మహేష్, బీజేవైఎం అధ్యక్షులు కలాల సాయి చందు, బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


