మాస్ట్రోలో 69వ SGF U/14 ఖో-ఖో రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక మాస్ట్రో పాఠశాలలో 69 వ ఎస్జీఎఫ్ అండర్ - 14 ఖో-ఖో రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక కొరకు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుండి బాలురు మరియు బాలికల విభాగంలో 8 జట్లు పాల్గొన్నాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో జగిత్యాల జట్టు, ద్వితీయ స్థానంలో పెద్దపల్లి జట్టు, బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో కరీంనగర్ జట్టు, ద్వితీయ స్థానంలో జగిత్యాల జట్లు గెలుపొందాయి. గెలిచిన జట్లకు షీల్డులు మెడల్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి లోకిని శ్రీనివాస్, కోరుట్ల సిఐ సురేష్ బాబు, ఎస్జీఎఫ్ జగిత్యాల జిల్లా సెక్రటరీ చక్రధర్ గారు, పాఠశాల కరెస్పాండంట్ ఆకుల రాజేష్, ప్రిన్సిపాల్ ఆకుల రంజిత్ మరియు పాఠశాల పీఈటి లు మల్లేష్, లంబా అలాగే మండల ఎస్జీఎఫ్ కన్వీనర్ రవీందర్ లు పాల్గొన్నారు.


.jpg)