ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి.. మార్పేంటో చూపిస్తా

ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి.. మార్పేంటో చూపిస్తా

పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటాం

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎలకేటి భరత్




9వ్యూస్, వేములపల్లి: ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి పుట్టిన ఊరు రణం తీర్చుకుంటా, మార్పు అంటే ఏమిటో మీ కండ్ల ముందే చూపిస్తానని లక్ష్మీదేవిగూడెం గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎలకేటి భరత్ అన్నారు... ఆదివారం నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని లక్ష్మీదేవి గూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ... నేను పుట్టిన గడ్డకు రుణం తీర్చుకునే అవకాశాన్ని కల్పించాలని, ఒక్కసారి సర్పంచిగా నన్ను ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధిని మీ కండ్లకు చూపిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎవరైనా ఇలానే మాట్లాడతారని అనుకోవద్దు, ఒక్కసారి నన్ను ఆశీర్వదించి చూడండి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలా నిలబెట్టుకుంటానో మీరే చూస్తారు కదా అన్నారు.. అందరూ నాయకులు వేరు నేను వేరు నేనేదో ఊరుని అడ్డం పెట్టుకొని సంపాదించాలని ఉద్దేశంతో ఈ అవకాశాన్ని అడగడం లేదన్నారు.. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా గ్రామంలో చేయవలసినటువంటి అభివృద్ధి ఇప్పటికీ అలానే ఉండిపోతుంది అన్నారు. అప్పుడప్పుడు నాకు మనసుకు అనిపిస్తూ ఉంటుంది గెలుస్తారు అభివృద్ధిని మర్చిపోతారు ఎందుకు అని అనిపిస్తుంది.. నేను సర్పంచిగా ఉంటే గ్రామంలో ఎలా అభివృద్ధి చేయాలో అనుకున్నాను అంతకు మించి అభివృద్ధిని చూపిస్తానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ప్రజలు పాల్గొన్నారు..

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.