అగాపే ఆశ్రమంలో అన్నదానం.
యాడికి మండలం, కమలపాడు రోడ్డు,రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో డేరంగుల ఆదినారాయణ భార్య లక్ష్మి కూతురు సంగీత మనవడు తేజస్వర్ వీరి కుటుంబము ఎంతోమంది అన్నదానం చేస్తున్నారని, మేము కూడా పెట్టాలని ఆశ కలిగి, వృద్ధులకి పెట్టడం మాకు కూడా ఆశీర్వాదం అని భావించి, కుటుంబము అంతా కలిసి భోజనాలు ఏర్పాటు చేయించి ఆశ్రమంలోని నిరాశ్రయులందరికీ అన్నదానం చేశారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి అభినందనలు తెలిపారు.


